రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈనెల 12న నిర్వహించనున్న ర్యాలీ, నిరసనలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.