అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో వివిధ పంటలపై నిర్వహించే పంట కోత ప్రయోగాలను జాగ్రత్తగా నిర్వహించాలని మండల విఆర్వోలకు మరియు వ్యవసాయ శాఖ సిబ్బందికి మండల తహసిల్దార్ అనిల్ కుమార్ సూచించారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పృథ్వి సాగర్, ఏఎస్ఓ మమతలతో కలిసి వీఆర్వోలు వ్యవసాయ శాఖ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 30వ తేదీ లోపు సాగు చేసిన ప్రతి ఎకరంలోని పంటకు ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయించాలని ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి అధికారులు ఆదేశించారు.