ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల రహదారి పక్కన ఉన్న విద్యుత్ పోల్ పైకి తీగ మొక్కలు పాకి పూర్తిగా చెట్టులా కనిపిస్తుంది. ఈ పోల్ కనిపించకుండా పచ్చని ఆకులతో కప్పబడి ఉండడంతో అది విద్యుత్ స్తంభమా లేదా చెట్టా అనే సందేహం వచ్చేలా మారింది. ఈ పరిస్థితి వల్ల విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలైత అవకాశం ఉండడంతో అధికారులు దృష్టి సారించి విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని గ్రామస్తులు కోరారు.