అంకితభావంతో విధులు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశా డే సమావేశానికి హాజరయ్యారు. ఆశా జాబ్ చార్ట్, రిపోర్టింగ్, రిఫెరల్ సర్వీసెస్, ప్రసవానంతర కేసుల సేవలపై ఆరా తీశారు.