శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరానికి కూటమి ప్రభుత్వం రూ. 1.60 కోట్ల నిధులతో రోడ్లు నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు ప్రారంభించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రంలో పడవ ప్రయాణం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ జనకర్, ఆర్డీవో కృష్ణమూర్తి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వేటకి వెళ్లే సమయంలో ఇసుక మ్యాటల వలన పడవ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కరించాలని కోరారు.