కామారెడ్డి : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి వరప్రసాద్ బుధవారం తీర్పు వెలువరించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు.. డోంగ్లి మండలం మోగ వాసి లక్ష్మణ్ గొండ (60) సంవత్సరాలు, గత ఏడాది జులై 20న బ్యాంకుకు వెళ్లేందుకు బయలుదేరి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి సాయిలును నిందితుడిగా గుర్తించారు. డబ్బు కోసం లక్ష్మణ్ ను హత్య చేసినట్లు తేలింది. కోర్టుకు హాజరుపరచగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.