సర్దార్నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశాలకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. 131 మంది లబ్ధిదారులకు వెంటనే గృహప్రవేశాలు కల్పించాలని కోరారు. అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన వాపోయారు.