సంతనూతలపాడు: ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సూచించారు. సంతనూతలపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు రూ.20.15 లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స పొందిన పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్థికంగా సహకారాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.