సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం చెర్ల రాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బుర్జుకాడి మహమ్మద్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. ఈ ఘటనలో లక్ష 50 వేల రూపాయల నగదు కాలి బూడిద కాగా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబాని పరమర్శించారు.