నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నీటి సమస్య తీవ్రంగా ఉందని రోడ్లు సరిగా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.