ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లిలో ఫరూఖ్నగర్ మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి దాదాపు రూ.3 లక్షల 50 వేల సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ సీసీ కెమెరాలు ప్రారంభించారు. గ్రామంలో అక్రమాలు, దోపిడీలను అరికట్టే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిఘా వ్యవస్థతో గ్రామం సురక్షితంగా ఉంటుందన్నారు.