రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్లు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నుండి అలాగే మూలవాగు మానేరు వాగుల నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరద నీరు బారీగా శ్రీ రాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేరులోకి చేరుతుండటం తో అధికారులు శ్రీ రాజరాజేశ్వర జలాశయం 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.