అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు ఇల్లెందు డిఎస్పి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.. మండల పరిధిలోని వెంకట్ క్యా తండా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా లారీపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా లారీలో రెండు కోట్ల 12 లక్షల రూపాయలు విలువ గలిగిన 424 కేజీల గంజాయిని గుర్తించడం జరిగిందని తెలిపారు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఒరిస్సా రాష్ట్రం నుండి రాజస్థాన్ కు గంజాయి తరలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని డిఎస్పీ తెలిపారు...