బషీర్బాగ్ విద్యుత్ అమర వీరులకు ఒంగోలులో సిపిఎం నేతలు గురువారం ఘన నివాళులర్పించారు.2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచగా సిపిఎం ఉద్యమించగా ప్రభుత్వం జరిపించిన కాల్పులలో ముగ్గురు మరణించారని ఈ సందర్భంగా సిపిఎం నేతలు చెప్పారు. అమరులైన ఈ ముగ్గురు ప్రజలకు స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. ప్రభుత్వం ఎంత ధమనకాండ సాగించినా ప్రజల కోసం సిపిఎం పోరాడుతూనే ఉంటుందని నేతలు ఉద్ఘాటించారు. అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు