నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణములో శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్, మండల తహశీల్దార్ బద్రు నాయక్ లు మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పెద్దల ఎడల గౌరవం పెంపొందాలన్నారు. పరిశుభ్రత అందరి బాధ్యత కావాలని సూచించారు. ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రణాళికతో కృషి చేయాలన్నారు.