రాజంపేట : అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆధుకోవాలని, భారతీయ కిసాన్ సంఘ్ రాజంపేట శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం రాజంపేట రైతు వేదికలో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ రాజంపేట అధ్యక్షులు మర్రి గోపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. అడవి పందులు, కోతులతోనే పంట నష్టపోతుంటే, వరద బీభత్సం సృష్టించి పంట చేలల్లో ఇసుక పేరుకుపోయి వరదలకు కొట్టుకుపోయి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించాలన్నారు. యూరియా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.