వెలిగండ్ల మండలంలోని చోడవరంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి అవ్వ ,తాతలకు ఆయన పెన్షన్లు అందజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు అవ్వ, తాతలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను భారీగా పెంచి అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.