ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ....