భీమ్ గల్ లో ఆదివారం రాధాష్టమి వేడుకలు నిర్వహించారు. మండలంలోని వాగు గడ్డ హనుమాన్ ఆలయంలో నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో రాధాష్టమి ఉత్సవము భజన కీర్తనలతో నిర్వహించారు. శ్రీకృష్ణరాయ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.