రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కొయ్యూరు ఏవో ఐ.భాను ప్రియాంక రైతులకు సూచించారు. గురువారం రాజేంద్రపాలెంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ రైతు సదస్సు నిర్వహించారు. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల భూమి సాంద్రత పెరుగుతుందన్నారు. పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. సాగులో పెట్టుబడి భారం తగ్గి, ఆరోగ్యవంతమైన దిగుబడులు పొందవచ్చన్నారు.