కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు డ్యాం అధికారులు శుక్రవారం తెలిపారు.రాత్రి కురిసిన భారీ వర్షానికి మానేరు జలాశయం లోని 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 10 గేట్ల ద్వారా 38, 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. మోయ తుమ్మెద వాగు, మీడ్ మానేరు నుంచి ఎగువ ప్రాంతం నుంచి 38వేల క్యూసెక్కుల నీరు లోయర్ మానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు.