గుంటూరు జిజిహెచ్ కి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ సూచించారు. మంగళవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.