మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన నిందితునికి జిల్లా 2వ అదనపు కోర్టు, SC,ST కోర్టు, జిల్లా ఫోక్సో కోర్టు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం మధ్యాహ్నం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగల హరీష్ అనే యువకుడు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఘటనలో బాధితురాలు 23-07-2018 లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సొ ఆక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా నేడు నిందితునికి జైలు శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు.