కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిన సందర్భంగా ఈ అభివృద్ధి వెనుక ఎంతో మంది ప్రజాప్రతినిధుల కృషి ఉందని పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అన్నారు. తాడికొండలో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాజధానిలో ఏర్పాటు చేసిన ప్రతి శిలాఫలకం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెబితే వారికి సలాం కొడతానని ఆయన పేర్కొన్నారు.