చెన్నూరు పట్టణంలో ఈనెల 3వ తేదీన రైతుల పక్షాన యూరియా కోసం జరిగిన ధర్నాకు మద్దతు ఇచ్చిన మాజీ కౌన్సిలర్ అనిల్ పై పట్టణ సీఐ దేవేందర్ రావు చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మున్నూరు కాపు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేవేందర్ రావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి పట్టణ బంద్ చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాపు బిడ్డలకు రాష్ట్ర సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు.