సదశివానగర్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు శ్రావణమాసం చివరి శనివారం ఎడ్లపొలాల అమావాస్య సందర్భంగా తెలంగాణ హిందూ సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్నా ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఎద్దులను సాక్షాత్తు శివుని ఆలయం ముందు నందీశ్వరునిగా భావించి ఎద్దుల ను శుభ్రంగా కడిగి పూలతో అలంకరణ చేసి బెల్లం పప్పు పదార్థాలు తినిపించారు. అనంతరం శివాలయం వెళ్లి నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ వంకాయల రవి, జిల్లా బీసీ నాయకుడు కుప్రియల్ సాయగౌడ్, ధర్మారావుపేట సురేష్, యాచారం తండా మాజీ సర్పంచ్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.