చిత్తూరు జిల్లా. పుంగనూరు మండల సమీపంలో గల గుంత ఎంబడి గ్రామంలో వినాయకుని నిమజ్జనం సందర్భంగా శుక్రవారం గ్రామంలోఊరేగింపు నిర్వహించారు. యువకులు బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. కృష్ణప్ప కుమారుడు లోకేష్ 31 సంవత్సరాలు చేతిలో ఉన్న టపాకాయ పేలడంతో లోకేష్ కుడి చేతికి రక్త గాయం అయింది. వెంటనే స్థానికులు లోకేష్ ను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.