రేపు జరిగే 46వ అనంత చతుర్దశి సామూహిక గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. 303 కి.మీ రహదారులు కాషాయరంగుతో అలంకరించారు. 34 చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు జరిగాయి. 40 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, వారికి అన్నప్రసాదం, నీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.