మహబూబ్ నగర్ లోని గ్రీన్ బెల్ట్ వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుల రాజు మాట్లాడుతూ.. భూమి, ఆత్మ గౌరవం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఐలమ్మ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు