దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్ట శివ సమేత కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం పలువురు భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి భక్తులు మాలధారణ చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో బ్రహ్మంగారిగుట్ట భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా పలువురు భవాని భక్తులు ఆటపాటలతో, భక్తి గీతాలు పాడి అలరించారు.