అనంతపురం పట్టణంలో వైకాపా నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తోపుదుర్తి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కేతిరెడ్డి ఎదురెదురుగా కూర్చొని మాటల కలపడం జరిగింది. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. కేతిరెడ్డికి పోటీగా ధర్మవరంలో వైకాపా కార్యాలయం సైతం ప్రారంభిస్తున్నట్లు ప్రకాష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు సైతం ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం సంచలనంగా మారింది.