ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి లో రెండు శరీరాలతో ఆదివారం వింత దూడ ను గేదె జన్మనిచ్చింది. దూడ రెండు శరీరాలు, ఆరు కాళ్లతో ప్రసవించడం గేదెకు కష్టంగా ఉండటం తో పశు వైద్యాధికారి కి యజమాని సమాచారం ఇచ్చారు. పశువైద్యులు అతి కష్టం మీద దూడను బయటకు తీసి గేదె ప్రాణాలు కాపాడారు. అప్పటికే దూడ చనిపోవడంతో రెండు శరీరాలతో వింతగా ఉన్న దూడను చూసేందుకు గ్రామ ప్రజలు ఆసక్తి చూపారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఈలాంటి దూడ లు జన్మిస్తూ ఉంటాయంటూ వైద్యులు తెలిపారు.