ఆగలి మండలంలోని హెచ్డి హళ్లి పంచాయితీ ఉల్లికేర గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు.గురువారం అగలి జడ్పీటీసీ ఉమేష్,ఎంపీపీ కామరాజు గ్రామస్తులతో కలిసి ట్యాంక్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 33 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.