రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని చందనగర్ డివిజన్ పరిధిలో రాంగ్ రూట్లో వచ్చిన బైకర్ ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగామృతులు చందానగర్ కు చెందిన మనోజ్ మరియు రాజుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.