ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోయిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో కొన్ని రోజులు నిశబ్దంగా ఉన్న రేషన్ బియ్యం దళారులు మళ్లీ అక్రమ దందాను ప్రారంభించారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.