కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతుంది. విద్యార్థినిలు రాత్రి డిన్నర్ చేసిన తర్వాత అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎలుకలు వచ్చి దాదాపు పదిమంది విద్యార్థినిలను గాయపరిచినట్లు సమాచారం. మిగతా విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పడంతో గాయపడ్డ వారిని స్థానిక పిహెచ్సిలో చికిత్స అందించారు. అయితే శనివారం మధ్యాహ్నం జిల్లా అధికారుల ఆదేశాలతో కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఇంచార్జ్ ఎంఈఓ లక్ష్మీనారాయణ, పిహెచ్సి డాక్టర్ శ్రావని సందర్శించారు. విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని