కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళవారం రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా గణేష్ కూడలిలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బయటాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువులు అందకుండా చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని, దీని వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలన్నారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు.