ఈరోజు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ నందు న్యాయశాఖతో సమన్వయంగా పని చేసి సూర్యాపేట జిల్లా పోలీస్ పెండింగ్ లో ఉన్న కేసుల్లో 5014 కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఇందులో 666 క్రిమినల్ కేసులు, 2156 ఈ-పెట్టీ కేసులు, 2282 యం.వి యాక్ట్, డ్రంకన్ డ్రైవ్ కేసులు పరిష్కరించడం జరిగింది అన్నారు.