రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సమీపంలో సమిష్ఠ అపార్ట్మెంట్ లో సోమవారం వినాయకుడి లడ్డూను గుర్తుతెలియని ముగ్గురు దుండగులు యాక్టివా బైక్ పై వచ్చి చోరీ చేశారు. లడ్డూ చోరీ చేస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.