భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని గురువారం వందలాది గీత కార్మికులు ముట్టడించారు. అక్రమ బెల్ట్ షాపులను రద్దు చేయాలని, ఉపాధి కోల్పోయిన గీత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ సీఐ బి.బలరామరాజుకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి మధ్యాహ్నం 1:30 కు మాట్లాడుతూ బెల్ట్ షాపుల నిర్మూలనపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడంలేదో ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం, మద్యం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం గీత కార్మికుల జీవితాలను నాశనం చేయడం సరికాదన్నారు.