తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం రైతులు ధర్నా చేశారు.కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నేతలు మాట్లాడుతూ రైతుల సమస్యలు పాలకులకు పట్టడం లేదని విమర్శించారు.ఒక్కో పంటను పండించే రైతు ఒక్కో రకం సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు.పత్తిపై దిగుమతి సుంకం రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయి ఆందోళన చేపడతామన్నారు.