ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం వద్ద బుధవారం ప్రజలకు దొరికిన ఓ జంతువు చిరుతపులిగా భావించి ఓ బుట్టలో బంధించారు. తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు గిద్దలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అది చిరుత పులి పిల్ల కాదని జంగిల్ క్యాట్ గా నిర్ధారించారు. జంగిల్ క్యాట్ ను మిగతా తోటి జంతువులు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయాయని వాటికి చికిత్స అందిస్తున్నట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. మూడు రోజులపాటు తమ సంరక్షణలో ఉంచుకొని కోలుకున్న అనంతరం జంగిల్ క్యాట్ నుఅడవిలో విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.