ఎడపల్లి మండలంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ,ప్రింట్ మీడియా జర్నలిస్టులు సమావేశమయ్యారు. అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కదం ప్రకాష్ రావు, ప్రధాన కార్యదర్శిగా జక్కం రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పోశెట్టి, కోశాధికారిగా జగన్మోహన్, సలహాదారులుగా భుజంగం లింగం, శేఖర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా సునీల్, రవికుమార్, విజయ్ గౌడ్,కందునూరి గంగాశంకర్, లింబాద్రి సతీష్,రవి నాయక్, గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సహచర జర్నలిస్టులు పూలమాలలతో సన్మానించారు.