బాపట్ల జిల్లా కర్లపాలెంలోని కూల్ డ్రింక్ షాపులో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్లపాలెం SI రవీంద్ర వివరాల ప్రకారం ఆగస్టు 30వ తేదీన ఎన్ హెచ్ 216 పక్కన ఉన్న కూల్ డ్రింక్ షాపులో గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల కోర్టులో హాజరు వచ్చినట్లుగా ఎస్సై రవీంద్ర తెలిపారు.