బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్య ప్రకాష్ బాబును హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత కొన్ని నెలలుగా కోటి సూర్య ప్రకాష్ బాబు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఆయనను పరామర్శించడం జరిగింది.