గర్భిణీ మృతి కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. 'మోతె మండలం రాఘవాపుర చెందిన గర్భిణీ అనూష మే నెలలో లింగ నిర్ధారణ కోసం ఆర్ఎంపీ యాదగిరిని కలిసింది. పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకుంది. తీవ్ర రక్తస్రావంతో అనూష మృతి చెందింది' అని తెలిపారు.