రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతంలో శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతుల వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. వారిని ఎల్బీనగర్, హస్తినాపురం వాసి బండారి శివకృష్ణ, బాలాపూర్ వాసి నిఖిల్, బైరమల్ గూడా వాసి బొర్రా మందీప్ గా పోలీసు అధికారులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అసుపత్రికి తరలించారు.