వర్షం లోనూ గణనాథులు పూజలందుకోవడానికి మండపాలకు బుధవారం తరులుతున్నాయి. కరీంనగర్ నగరంలో వివిధ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల నుంచి పూజలందుకోవడానికి మండపాలకు వర్షంలో కూడా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్, రాలి ఆటోలలో తరలిస్తున్నారు. ఉదయం నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం కాస్త పెరగడంతో వర్షంలోనూ వినాయకులను తరలిస్తున్నారు. సాయంత్రం నుంచి గణనాథులు తొమ్మిది రోజులు పూజలు అందుకోనున్నాయి.