మేడారం జాతరకు సంబంధించిన పనులను అన్ని శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. నేడు గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తాడ్వాయి మండలం మేడారంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన మహా మేడారం జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు.