సోమవారం నడికూడ మండల కేంద్రంలో డి ఆర్ డి ఏ మరియు ఎస్ ఈ ఆర్ పి పౌర సరఫరాల శాఖ& వెంకటేశ్వర గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయుచర్ ఉండాలి అని అన్నారు.రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, అన్నారు